ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలు రెండవ రోజు ఆనందపురం తాసిల్దార్ వినతిపత్రం అందజేశారు ఈ నిరసన కార్యక్రమం ఏపీటీఎఫ్ మాజీ అధ్యక్షుడు గంగాధరుడు సారధ్యంలో జరిగింది. ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయుల హక్కుల కోసం, విద్యా రంగం అభివృద్ధి కోసం నిరసనల రూపంలో పోరాటం తప్పనిసరి అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు, మహిళా ప్రతినిధులు పాల్గొని ప్రభుత్వంపై తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.