విశాఖ మధురవాడ మాజీ కార్పొరేటర్ 5వవార్డ్ వైస్సార్సీపీ అధ్యక్షులు పోతిన హనుమంతరావు భవనాన్ని రోడ్డు అవసర నిమిత్తం జివిఎంసి అధికారులు శనివారం తొలగింపు చర్యలు ప్రారంభించారు. దీంతో మధురవాడ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీవీఎంసీ అధికారులు జీవీఎంసీ కమీషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలతో పోలీసుల సహాయంతో భారీ భద్రత మధ్య తొలగింపు నిర్వహిస్తున్నారు. వైస్సార్సీపీ నేతలుపై కక్ష సాధింపులో భాగంగా భవనం తొలగింపు చేస్తున్నారని దీనిపై పోరాటం చేస్తామని తెలుపుతున్నారు.