కర్నూలు: ఏబీసీ ప్రభుత్వ క్వార్టర్స్‌లో పేద ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలను తక్షణమే ఆపాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ఆమె ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ… “పేదలపై అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యం బాధాకరం. తమ కష్టార్జితంతో జీవనం సాగిస్తున్న నిరుపేదలను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం” అని హెచ్చరించారు.ఏబీసీ క్వార్టర్స్‌లో