అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో పాడేరు పాత బస్టాండ్ ఆవరణ వద్ద ఉన్న డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నేతలు కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ వైయస్ఆర్ అంటూ నినాదాలు చేశారు.