నగరి నియోజకవర్గం, వడమాలపేట తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. ప్రజల నుండి వినతులను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.