గర్భవతులు,బాలింతలు,చిన్నపిల్లలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ ఓబులమ్మ అన్నారు.కుందుర్పి మండలం ఎన్ వెంకటాంపల్లి అంగన్వాడీ కేంద్రంలో శనివారం పోషణ పౌష్టికాహారం మాసోత్సవాలను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.పోషక విలువలు ఉన్న పదార్థాలను తీసుకోవాలన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలకు ప్రతినెల క్రమం తప్పకుండా పౌష్టికాహారాన్ని సరఫరా చేస్తున్నాయన్నారు.