సాంప్రదాయ బద్ధంగా వినాయక విగ్రహ ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కోరారు. శుక్రవారం రాత్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేసి వినాయక విగ్రహాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటును పరిశీలించి పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఉత్సవ కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఉత్సవాలు ఊరేగింపు కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.