పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు.మొదటగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో, పత్తిపాక సింగిల్ విండో చైర్మెన్ నోముల వెంకట్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరగా, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రాథమిక పాటశాల ఆవరణలో, 12 లక్షల ఎన్.ఆర్.ఈ.జీస్ నిధులతో నిర్మించనున్న అంగన్వాడి భవనానికి శంకుస్థాపన చేసారు.అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 20 లక్షల వ్యయంతో, నూతన డార్మేటరి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు.