రైతులకు అందాల్సిన ఎరువులను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే చర్యలు తప్పవని జమ్మలమడుగు డిఎస్పి వెంకటేశ్వర రావు హెచ్చరించారు.మంగళవారం కడప జిల్లా జమ్మలమడుగులోని ఎరువుల దుకాణాలలో జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జమ్మలమడుగు డిఎస్పి వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.రైతుల పాస్ బుక్కులు చూసి ఎన్ని ఎకరాలకు ఎంత మేర అవసరం ఉంటుందో ఆ మేరకు మాత్రమే విక్రయించాలని డీఎస్పీ వెంకటేశ్వరరావు డీలర్లకు సూచించారు. విక్రయాలకు సంబంధించిన రిజిస్టర్ ను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. లైసెన్స్, విక్రయ రికార్డులను తనిఖీ చేశారు.