సోమవారం వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో భాగంగా ఈరోజు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 5 ఫిర్యాదులు వివిధ సమస్యలపై నేరుగా డిసిఆర్బి డిఎస్పి ఇన్చార్జ్ అదనపు ఎస్పి ఉమామహేశ్వరరావు గారికి ఫిర్యాదులు అందించారు పోలీస్ అధికారులు తక్షణమే సదరు ఫిర్యాదులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈరోజు ప్రజావాణిలో మొత్తం ఐదు ఫిర్యాదుల్లో రెండు భూతగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు రెండు భార్యాభర్తల ఫిర్యాదులు ఒకటి పరస్పర గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు డిసిఆర్బి డిఎస్పి చర్యలు తీసుకోవడం పై వచ్చిన ఫిర్యాదుదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు