వడదెబ్బతో కూలీ మృతి చెందిన సంఘటన నవాబ్పేట మండలంలోని మాడిరెడ్డిపల్లి లో మంగళవారం సాయంత్రం 4:00 గంటల సమయంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి కృష్ణయ్య వయసు 57 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేస్తుండగా వడదెబ్బతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.