బెజ్జూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు గ్రామపంచాయతీ కార్మికులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 51 వెంటనే సవరించి తద్వారా వేతనాలు చెల్లించాలని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు,