ఆటో బోల్తా పడిన ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన ఘటన మంగపేట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు..మినరల్ వాటర్ ట్యాంక్ తో వెళ్తున్న ఆటో మంగళవారం మధ్యాహ్నం మల్లూరు ప్రధాన రహదారి మధ్యలో ప్రమాదానికి గురైందన్నారు. రోడ్డుపై గుంతలు ఉన్న కారణంగా అదుపుతప్పి బోల్తా పడిందన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలైనట్లు తెలిపారు.