దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దు తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్ హల్ లో నిర్వహించిన నేతన్న పొదుపు, నేతన్న బీమా పథకాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు, సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి