రాయదుర్గం పట్టణంలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవీ శరన్నవరాత్రులలో బాగంగా సోమవారం ఉదయం పట్టణంలోని అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష అలంకరణ చేసి భక్తిశ్రద్దలకు దర్శనం కల్పించారు. వినాయక ఉత్సవాల తరహాలో 7వ వార్డు నేసేపేటలో కనకదుర్గ అమ్మవారి విగ్రహ ఏర్పాటు చేశారు. గంగపూజ చేసి కళశ హారతులు పట్టి పట్టణంలో ఊరేగింపుగా అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లారు మండపంలో కొలువుదీర్చ్చారు.