ప్రజా సమస్యలను సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారదిశగా పని చేయాలని అధికారులకు సూచించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని అన్నారు. ఇందులో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.