ప్రజలపై భారాలు మోపే విద్యుత్ చార్జీల పెంపు స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయకపోతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని వామపక్ష పార్టీ నేతలు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 10 వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా తిరుపతి బైరాపట్టల్లోని సిపిఐ కార్యాలయంలో విద్యుత్ పోరాటంలో తుపాకీ తూటాలకు బలైపోయిన రామకృష్ణ విష్ణువర్ధన్ బాలస్వామి లకు విప్లవ జోహార్లు అర్పిస్తూ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.