పశ్చిమ గోదావరి జిల్లా తీరప్రాంతంలో సముద్రపునాచు (సీవీడ్) సాగు ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలకు అదనపు ఆదాయం కల్పించేందుకు శిక్షణ ప్రారంభమైంది. నరసాపురం మండలం పెద్దమైనవానిలంకలో గురువారం సాయంకాలం 6 గంటలకు జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రధాన అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, చేపల వేటకు మాత్రమే పరిమితం కాకుండా సముద్రపునాచు వంటి ఉత్పత్తుల ద్వారా కూడా ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. త్వరలో చినమైనవానిలంక, పేరుపాలెం ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులు చేపడతామని చెప్పారు.