పత్తికొండ పట్టణంలో వీధి కుక్కల దాడిలో మహిళతో సహా 12 మంది గాయపడ్డారు. శుక్రవారం మదిరె గ్రామానికి చెందిన అయ్యమ్మతో పాటు మరికొందరు రోడ్డుపై నడుస్తుండగా కుక్కలు దాడి చేశాయి. స్థానికులు వారిని రక్షించి, గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో కుక్కల బెడద అధికంగా ఉందని, వాటిని అరికట్టేందుకు గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.