దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా అధ్యక్షుడు బుచ్చేంద్ర మాట్లాడుతూ, దివ్యాంగులకు నెలకు 6 వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.