తుగ్గలి మండలం బాట తాండాకు చెందిన మల్లేశ్వరి అనే వివాహిత శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆటోలో గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో మల్లేశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.