ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి. అన్ని దానాల కంటే రక్తదానం చాలా గొప్పదని రక్తదాతల సంఘం జిల్లా అధ్యక్షులు కంబాల తిమ్మారెడ్డి, బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి కమలాక్షి లు అన్నారు. కళ్యాణదుర్గంలోని ఓం శాంతి భవనంలో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం కు చెందిన రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు యువతీ యువకుల నుంచి రక్తాన్ని సేకరించారు. యువతీ, యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం మరొకరి ప్రాణాలు కాపాడుతుందన్నారు.