Download Now Banner

This browser does not support the video element.

రాయదుర్గం: ఎమ్మెల్యే అనుచరులమంటూ హనుమాన్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు యాజమాన్యం దౌర్జన్యం, పోలీసులకు పిర్యాదు చేసిన బాదితుడు

Rayadurg, Anantapur | Sep 9, 2025
ఎమ్మెల్యే అనుచరులమంటూ ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. తన పట్ల బస్సు యాజమాన్యం వ్యవహరించిన తీరుపై బాదితుడు కెంచెలక్ష్మీనారాయణ తో పాటు మరికొందరు మంగళవారం రాత్రి రాయదుర్గం లోని ఆ సంస్థ కార్యాలయం వద్ద ప్ల కార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ లోనూ పిర్యాదు చేశారు. హనుమాన్ ట్రావెల్ బస్సులో తిరుపతి నుంచి రాయదుర్గం వస్తుండగా సోమవారం తెల్లవారుజాము అనంతపురంలోనే ప్యాసింజర్ లను దింపేశారు. ఓ కారు లో వారిని రాయదుర్గం పంపే ప్రయత్నంలో ఇదేమిటని ప్రశ్నించిన రాయదుర్గానికి చెందిన కెంచె లక్ష్మీనారాయణ పై దుర్బాషలాడుతూ దాడి చేయబోయారని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us