అన్నమయ్య జిల్లా, సంబేపల్లి మండలం: అదనపు కట్నం కోసం వేధింపులకు గురవుతున్నానంటూ ఓ మహిళ అత్తవారింటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగిన ఘటన సంబేపల్లి మండలంలో చోటుచేసుకుంది.నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ముడి కళ్యాణి, పాలెంగడ్డ పాపన్నగారిపల్లె గ్రామానికి చెందిన ఎనుగొండ యాదగిరి నాయుడితో 2024 నవంబర్ 8న వివాహం జరిగింది. పెళ్లి అయిన వారం రోజులు గడవకముందే భర్త, అత్తమామలు అదనపు కట్నం తేవాలని వేధించారని కళ్యాణి ఆరోపిస్తోంది.తన భర్త యాదగిరి నాయుడు విడాకులు కావాలంటూ కోర్టు నోటీసులు పంపడంతో తీవ్ర ఆవేదన చెందిన కళ్యాణి.