ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఏర్పడబోయే చంద్రగ్రహనాన్ని ఎవరైనా వీక్షించవచ్చు అని ప్రకాశం జిల్లా జన విజ్ఞాన వేదిక కార్యదర్శి విశ్వరూపం అన్నారు. ఆదివారం పబ్లిక్ యాప్ ప్రతినిధితో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మాట్లాడిన ఆయన చంద్రగ్రహణంపై మాట్లాడారు. ఆదివారం రాత్రి 9:50 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి 12 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందన్నారు. సోమవారం వేకువజామున 2 గంటలకు చంద్రగ్రహణం పూర్తవుతుందని గర్భిణీ స్త్రీలు కానీ ఇతరులు ఎవరైనా సరే చంద్రగ్రహణం వీక్షించవచ్చు అన్నారు. అరుదగా వచ్చేటువంటి దృశ్యాలను మూఢనమ్మకాలతో వీక్షించకుండా దూరం కావద్దన్నారు.