మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యతగా భావించాలని రైల్వే కోడూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాగార్జున సూచించారు. స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రైల్వే కోడూరు ప్రధాన రహదారి లోని మురికి కాలువలను అధికారులు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శుభ్రత పై ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని అన్నారు. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని అన్నారు.