ఆదోనిలో ఐదవ రోజు గణేశ్ నిమజ్జనం కార్యక్రమాలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఆదివారం పట్టణం నుంచి చిన్న హరివాణం వద్ద ఎల్లెల్సీ కాలువలో నిమజ్జనం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు కలిసి పనిచేస్తున్నాయి. ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కురువ కార్పొరేషన్ ఛైర్మన్ మాన్వి దేవేంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.