శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ లో జీఆర్పి ఎస్సై తన సిబ్బందితో పలు రైలును తనిఖీ చేయగా... బుధవారం రాత్రి 8 గంటలకు మహారాష్ట్ర కి చెందిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో వారిని అదుపులోకి తీసుకొని విసారించారు. ఈ విచారణలో వారి వద్ద ఉన్న రెండు ట్రావెల్ బ్యాగ్స్లలో 38 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. వీటి విలువ రూ2లక్షలు ఉంటుందని తెలిపారు. పట్టుబడిన ఇద్దరు యువకులు మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు గుర్తించి విశాఖ కోర్టుకు తరలించారు.