నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షానికి వర్ని మండలంలో చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. భారీ వర్షం వల్ల ఉమ్మడి మండలంలో చెరువుల అలుగులు తన్ని ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వర్ని మండలంలోని సైదిపూర్ రిజర్వాయర్ అలుగులు తన్ని రోడ్డుపై నుండి భారీగా వరద వెళ్లడంతో జలాల్పూర్ బడా పహాడ్ పుణ్యక్షేత్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. కోకల్ దాస్ తండా శివారులో వాగు ఉధృతంగా ప్రవహించడంతో ముడి బడా పహాడ్ కు రాకపోకలు నిలిచిపోయాయి. బొప్పాపూర్ శివారులో గుండ్ల వాగు కు భారీ వరద రావడంతో రోడ్డుపై నుంచి భారీగా వరదప్రహ ప్రవాహం వెళ్లడంతో బొప్పాపూర్ రుద్రూర్ కు రాకపోకలు నిలిచిపోయాయి.