జగిత్యాల జిల్లాలో బుధవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి నది భారీగా ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.అధికారులు ఎక్కడ ఎలాంటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు సత్వరమే స్పందించాలని ఆదేశించారు. ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వస్తున్న భారీ వరద దృష్ట్యా గురువారం మధ్యాహ్నం 12-30 గంటల ప్రాంతంలో ధర్మపురి గోదావరి నది, ధర్మపురి మండలం నేరెళ్లలో లో లెవెల్...