ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో ఎస్సీ ఉపకులాల కృతజ్ఞత సన్మాన సభ కార్యక్రమాన్ని బుధవారం రాత్రి నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. ములుగు జిల్లాలో ఉన్న ఉప కులాలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో రాజకీయ అవకాశాలు ఇస్తానని, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.