చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏఐ టెక్నాలజీ క్లాస్ ప్రారంభం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఆయన విద్యార్థులతో కాసేపు పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను, మధ్యాహ్న భోజనం, మౌలిక వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు భోదిస్తున్న తీరును పరిశీలించారు.