కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని యోగివేమన విద్యాలయ సర్ సివి రామన్ సైన్స్ బ్లాక్ వద్ద శుక్రవారం ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.యోగి వేమన విశ్వ విధ్యాలయ అభివృద్ధికి 100 కోట్ల రూ. నిధులు కేటాయించాలని ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో విద్యార్థులు గళం విప్పారు. ఈ సందర్బంగా ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఓబులేసు మాట్లాడుతూ గత 20 సం. లుగా రాష్ట్రం లోని అన్ని విశ్వవిద్యాలయాలకు కావాల్సిన నిధులను విడుదల చేశారని, కానీ వైవియు కు మాత్రం అర కోర నిధుల తో సరిపెట్టారన్నారు.ప్రభుత్వ, వైవియు అధికారుల నిర్లక్ష్యం వలన నిధుల విషయంలో అన్యాయం జరిగిందన్నారు.