పీ ఆర్ సీ కమిషన్ ను ఏర్పాటు చేసి ఐ ఆర్ ను ప్రకటించాలని ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మయై, జిల్లా నాయకులు ఈరన్న లు అన్నారు. కుందుర్పి తహశీల్దార్ కార్యాలయం వద్ద ఏ పీ టీ ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వం పీ ఆర్ సీ కమిషన్ను వేయడం జరిగిందన్నారు. అయితే దాన్ని రద్దు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే పీ ఆర్ సీ వేసి ఉపాధ్యాయులకు రావలసిన 30 వేల కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రాన్ని తహశీల్దార్ ఓబులేసుకు అందజేశారు.