కడప జిల్లా జమ్మలమడుగు ఆర్ అండ్ బి బంగ్లాలో శుక్రవారం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం జమ్మలమడుగు, మైలవరం మండలాల కమిటీల విస్తృత సమావేశం సిపిఎం జమ్మలమడుగు మండల కార్యదర్శి దాస్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలు కడప జిల్లా కేంద్రంగా, కడప నగరంలో సెప్టెంబర్ 8, 9, 10, తేదీలలో జరగనున్నాయని తెలిపారు. ఈ జాతీయ కౌన్సి సమావేశాలకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు, కేరళ ప్రభుత్వ చైర్ పర్సన్ విజయ రాఘవన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు శివదాసన్, 22 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారన్నారు