కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కేసుల నమోదు చేసి జైలుకు పంపుతామని కరీంనగర్ రూరల్ ఇన్ స్పెక్టర్ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. గురువారం సాయంత్రం గత రెండు రోజుల క్రితం ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు కొత్తూరి ఆంజనేయలు, కొత్తూరి తిరుపతి, దాసరి సంపత్ లు మరొకసారి ఎలాంటి చట్ట వ్యతిరేక చర్య చేప్పట్టకుండా ముందస్తుగా కరీంనగర్ రూరల్ MRO ముందు హాజరుపరిచి బైండ్ ఓవర్ చేశారు. రాత్రి సమయంలో బొమ్మకల్ గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులు సైతం బైండోర్ చేశారు.