వర్షాకాలంలో దోమల నివారణకు ఎంటమాలజీ ఏఈ తేజశ్రీ సిబ్బందితో కలిసి ఇంటింటా పర్యవేక్షణ చేశారు. నీటినిలువల వల్ల దోమల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా శుభ్రంగా ఉంచుకోవాలని, లార్వా నివారణకు తేమ పాస్ కెమికల్ స్ప్రే చేస్తూ నీటి నిల్వ ఉన్న సంపులను శుభ్రం చేసినట్లు వెల్లడించారు.