ఏలూరు జిల్లా భీమడోలు గ్రామంలోని పలు స్థానిక హాస్టళ్లను తహసీల్దార్ బీ రమాదేవి ఆకస్మిక తనిఖీచేసారు. ఈమేరకు జాతీయ శిశు రక్షణ కమిషన్ నిబంధనల ప్రకారం కల్పించిన వసతులను పరిశీలించారు. ముఖ్యంగా ఆహార నాణ్యత, భోజనవసతులు, సీసి కెమెరాల పనితీరు, కాంపౌండ్ వాల్ స్థితి, నిధుల సక్రమ వినియోగం, భద్రతా నిబంధనల అమలు వంటి అంశాలపై సమగ్రంగా తనిఖీలు నిర్వహించి, హాస్టల్ నిర్వాహకులకు అవసరమైన సూచనలు అందించారు.