అల్లూరి జిల్లా పెదబయలు మండలం పెద్దకూడా పల్లి పంచాయతీ ప్రధాన రహదారి బురద మయంగా మారడంతో అటువైపుగా రాకపోకలు సాధించడం కష్టతరంగా మారిందని స్థానిక యువత గ్రామ గిరిజనులు తమ సమస్యను వెల్లడిస్తూ బురదలో నిలుచుని నిరసన వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తమ సమస్యలను వెల్లడిస్తూ రహదారి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖల అధికారులు సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.