వికారాబాద్ జిల్లా ధరూర్ మండల కేంద్రానికి చెందిన మౌలాలి సతీమణి తహేరా బేగం అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని ఆమె చికిత్స కోసం ప్రభుత్వం తరఫున రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం హైదరాబాదులో ఆయన నివాసంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి పేదవారికి కార్పొరేట్ వైద్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.