గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని రాయదుర్గం పట్టణంలోని వివిధ విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మద్యాహ్నం పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, బాలికల జూనియర్ కళాశాల, కెటిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో గిడుగురామమూర్తి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ మాతృభాష గొప్పతనాన్ని ఆయా కళాశాలల ప్రధానాచార్యులు, తెలుగు అధ్యాపకులు వివరించారు. వ్యవహారిక భాష గొప్పతనం, ప్రస్తుతం మాతృభాష ప్రాధాన్యత, తెలుగు భాష ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు.