పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు పై మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చేసిన ఆరోపణలు అవాస్తవం అని అవాస్తవాలు ప్రచారం చేస్తే సహించేది లేదంటూ పాడేరు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నేతలు హెచ్చరించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మీడియాకి ఓ వీడియోని విడుదల చేశారు. ఆదివారం చింతల వీధి వినాయక చవితి ఉత్సవాల్లో స్కార్పియో ప్రమాదంలో మృతి చెందిన మృతుల పట్ల కనీస స్పందన లేదంటూ మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణపై తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే అనారోగ్యం కారణంగా ఆయన ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులంతా వారికి న్యాయం చేసేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నాలు కొనసాగించారని తెలిపారు.