ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సైబర్ క్రైమ్ డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ పై ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి సోమవారం సాయంత్రం ఒక వీడియోను విడుదల చేశారు. ఇందులో డిజిటల్ అరెస్ట్ అనే కొత్త పద్ధతిని వినియోగిస్తూ సైబర్ నేరగాళ్లు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు అన్న అంశంపై వివరాలు వెల్లడించారు ఇటువంటి సంఘటనలు జరిగితే వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని లేదా 112 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.