అల్లూరి జిల్లా పెదబయలు మండలం సీత గుంట పంచాయతీ రోగులుపేట జంక్షన్ వద్ద పోలీసుల తనిఖీల్లో 65 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్టు కాగా ఒక బైక్ సీజ్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మీడియాకి ఎస్సై కొల్లి రమణ ఇచ్చిన వివరాల ప్రకారం ముందస్తు సమాచారం మేరకు రోగులుపేట జంక్షన్ వద్ద తనిఖీ చేస్తున్న నేపథ్యంలో బైక్ పై మూడు గోని సంచుల్లో తరలిస్తున్న 65 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్టు చేసామని వారిపై ఎన్డిపిఎస్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని ఎస్సై తెలిపారు. పట్టుకున్న గంజాయి మూడు లక్షలు ఉంటుందని తెలిపారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేస్తున్నారంటూ వెల్లడించార