కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించాలని మాజీ మంత్రి వైసిపి సీనియర్ నాయకుడు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రి లోని జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన లో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో అంగవైకల్యం ద్వారా పెన్షన్లు పొందిన వారికి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ పేరుతో తొలగించారని మండిపడ్డారు. ఈ పెన్షన్లు తొలగింపు పై కలెక్టరేట్లో ఫిర్యాదు చేస్తామన్నారు మాజీ మంత్రి.