ప్రకాశం జిల్లా తర్లుపాడు ఎంపీడీవో చక్రపాణి ప్రసాదును పబ్లిక్ సర్వీసెస్ జిల్లా అధికారుల వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కంటింజెంట్ వర్కర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో చక్రపాణి ప్రసాద్ పై దర్యాప్తు జరిపి ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఎంపీడీవో పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. విచారణలో అధికారులు ఎంపీడీవో లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం నిజమేనని నిర్ధారించారు. ఎంపీడీవో పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడాన్ని ఎమ్మార్పీఎస్ నాయకులు స్వాగతిస్తున్నామని అరెస్టు చేసే వరకు ఊరుకునేది లేదన్నారు.