సాధారణంగా గ్రహణం సమయంలో ఆలయాలు మూసివేసి, పూజా కార్యక్రమాలు నిలిపివేస్తారు. కానీ కాకినాడ జిల్లా పిఠాపురం పదవ శక్తిపీఠం పాదగయా క్షేత్రంలో మాత్రం చంద్ర, సూర్య గ్రహణాల సమయంలో కూడా పూజలు, దర్శనాలు యథాతథంగా కొనసాగుతాయి. ఈ ఆలయానికి గ్రహణ దోషం పట్టదని భక్తుల నమ్మకం. అందుకే ప్రధాన దేవతలతో పాటు ఉపాలయాలు కూడా తెరిచే ఉంటాయి. ఆదివారం రాత్రి 9:50 నుంచి సోమవారం తెల్లవారుజామున 1:30 వరకు పూజలు జరుగుతాయని ఆలయ అధికారులు ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు తెలిపారు.