వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు తక్షణమే చేపట్టి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులతో వర్షాలు, వరదల కారణంగా కలిగిన నష్టాలపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రహదారులు మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. దెబ్బతిన్న వనరుల పునరుద్ధరణకు విభాగాలవారీగా ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో వేగంగా చర్యలు చేపట్టాలని అధి