ములుగు జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతులు ఫర్టిలైజర్ షాపుల వద్ద నేడు మంగళవారం రోజున ఉదయం 9 గంటలకు బారులు తీరారు. గత కొంతకాలంగా రైతులు యూరియా కోసం పీఏసిఎస్ గోడౌన్ ల వద్ద చెప్పులతో క్యూ లైన్ లు పెట్టీ మరీ ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. సరైన సమయంలో వరి, పత్తి, మిర్చి పంటకు యూరియా అందక రైతులు ప్రతిరోజు యూరియా కోసం క్యూ లైన్లో నిల్చోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు టోకెన్ సిస్టం ద్వారా రైతులకు యూరియాను అందిస్తున్నట్లు చెబుతున్నారు.