రంపచోడవరం ఐటిడిఏ కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 64 అర్జీలు స్వీకరించినట్లు రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్ట సింహాచలం తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు సంబంధించిన సమస్యల పై దరఖాస్తులను స్వీకరించి కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించి మరికొన్ని సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కార మార్గాలు అన్వేషించి సమస్యలు పరిష్కారం కొరకు సంబంధిత అధికారులకు పంపడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా. సింహాచలం పేర్కొన్నారు.